మే 7, 2026 గురువారం రాశిఫలాల ప్రకారం కొన్ని రాశులకు శుభయోగం కనిపిస్తుండగా మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు సూచించబడ్డాయి. చంద్రుడి ధనస్సు సంచారం కారణంగా కొన్ని మార్పులు, అవకాశాలు కలగనున్నాయి.
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనిలో ఒత్తిడి, కోపాన్ని నియంత్రించుకోవాలి, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వృషభ రాశి వారికి కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఆకస్మిక ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉండటంతో జాగ్రత్త అవసరం.
మిథున రాశి వారికి శుభయోగం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం, శుభవార్తలు రావడం, కుటుంబంలో ఆనందం పెరగడం కనిపిస్తుంది.
కర్కాటక రాశి వారికి ప్రయాణ యోగాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నప్పటికీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
సింహ రాశి వారికి కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విదేశీ అవకాశాలు, కొత్త ప్రయత్నాలకు అనుకూల సమయం కనిపిస్తుంది.
కన్య రాశి వారికి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నష్టం, అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
తుల రాశి వారికి ఆర్థికంగా మంచి లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు, వస్తు లాభాలు పొందే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనలాభం, కొత్త వస్తువుల కొనుగోలు యోగం కనిపిస్తుంది.
ధనస్సు రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది.
మకర రాశి వారికి విమర్శల వల్ల మనోవేదన కలిగే అవకాశం ఉంది,
కుంభ రాశి వారికి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది,
మీన రాశి వారికి పేరు ప్రతిష్టలు, ఆకస్మిక ధనలాభం కనిపిస్తాయి.