6th May 2026

____________

- Saidulu

రుచికరమైన స్ట్రీట్ ఫుడ్..పాపిడి చాట్ రిసిపీ

పాపిడి చాట్ ఒక ప్రసిద్ధ భారతీయ స్ట్రీట్ ఫుడ్. ఇది క్రిస్పీ పాపిడీతో పాటు చట్నీలు, కూరగాయల కలయికతో తయారవుతుంది. రుచిలో తీపి, పులుపు, కారం సమతుల్యంగా ఉంటాయి. స్నాక్‌గా చాలా మంది ఇష్టపడతారు.

మొదట పాపిడీలను క్రిస్పీగా వేయించి సిద్ధం చేసుకోవాలి. ఇవి చాట్‌కు బేస్‌గా ఉపయోగపడతాయి. సులభంగా మార్కెట్‌లో లభిస్తాయి లేదా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.

తరువాత ఉడికించిన బంగాళాదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇవి చాట్‌కు మంచి టెక్స్చర్ ఇస్తాయి. పాపిడీపై వీటిని సమానంగా వేసుకోవాలి.

ఉల్లిపాయలు, టమాటాలు చిన్నగా తరిగి జోడించాలి. ఇవి తాజాదనాన్ని ,రుచిని పెంచుతాయి. చాట్ మరింత టేస్టీగా మారుతుంది.

పైన పెరుగు వేసుకోవడం ముఖ్యమైన స్టెప్. ఇది క్రీమీ టెక్స్చర్ ఇచ్చి రుచిని బ్యాలెన్స్ చేస్తుంది.

ఇమలీ, పుదీనా చట్నీ పాపిడి చాట్‌కు అసలు రుచిని ఇస్తాయి. తీపి, పులుపు కలయిక ప్రత్యేకంగా ఉంటుంది.

చివరగా చాట్ మసాలా, ఉప్పు, కారం చల్లి బాగా మిక్స్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మీ టేస్టీ తగ్గట్లు దానిమ గింజలు కూడా యాడ్ చేయవచ్చు.

తయారైన పాపిడి చాట్ వెంటనే సర్వ్ చేయాలి. క్రిస్పీగా ఉండగానే తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది సాయంత్రం స్నాక్‌గా మంచి ఎంపిక.