రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. కొన్ని సహజ ఆహారాలు శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి.
ఓట్స్ వంటి పౌష్టికాహారం ఉదయం తీసుకుంటే శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ లభించి ఎక్కువసేపు శక్తి నిల్వ ఉంటుంది.
అరటిపండు తక్షణ శక్తిని అందించే సహజ ఆహారం. ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల అలసట తగ్గుతుంది.
పప్పులు , శనగలు ప్రోటీన్ సమృద్ధిగా కలిగి ఉండి శరీర కండరాలకు శక్తిని అందిస్తాయి.
బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు అందించి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
మెంతి కూర,పాలకూర వంటి ఆకుకూరలు ఐరన్ సమృద్ధిగా ఉండి రక్తహీనతను తగ్గించి శక్తిని పెంచుతాయి.
పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శక్తిని సమతుల్యంగా ఉంచుతుంది.
ఈ అద్భుతమైన ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే శరీరం రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా ఉంటుంది.