మీ పుట్టిన తేదీ గురించి సంఖ్యాశాస్త్రం ఏం చెబుతుందో తెలుసా?

21st April 2026

White Scribbled Underline

మన పుట్టిన తేదీ మన జీవితంపై ప్రభావం చూపుతుందని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. కొందరికి అదృష్టం సులభంగా కలిసొస్తే, మరికొందరికి కష్టపడి సాధించాల్సి వస్తుంది.

1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు సంఖ్య 1కు చెందుతారు. వీరిపై సూర్యుడి ప్రభావం ఉండి నాయకత్వ లక్షణాలు సహజంగా కనిపిస్తాయి.

ఈ సంఖ్య వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏ పని చేపట్టినా గుర్తింపు, గౌరవం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు సంఖ్య 5కు చెందుతారు. వీరిని బుధుడు ప్రభావితం చేస్తాడు కాబట్టి తెలివితేటలు, మాటతీరు వీరి బలం అవుతుంది.

వీరు వ్యాపారంలో వేగంగా ఎదగగలరు. కొత్త విషయాలు త్వరగా నేర్చుకుని మంచి సంపాదన సాధిస్తారు. అయితే వీరికి ఆలోచనలో స్థిరత్వం చాలా అవసరం.

6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు సంఖ్య 6కు చెందుతారు. వీరిపై శుక్రుడి అనుగ్రహం ఉండటం వల్ల సౌఖ్య జీవితం వైపు ఆకర్షితులవుతారు.

కళలు, వినోద రంగాల్లో వీరు మంచి స్థాయికి చేరతారు. సౌకర్యాలు, విలాసవంతమైన జీవనం వీరికి సహజంగా లభిస్తుంది.

9, 18, 27 తేదీల్లో పుట్టిన వారు సంఖ్య 9కు చెందుతారు. వీరిని కుజుడు ప్రభావితం చేయడంతో ధైర్యం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది.

లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగరు. కష్టపడి సంపదను సంపాదించడంలో వీరు ముందుంటారు. కానీ మీరు పాట్నర్షిప్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.