స్నానం చేసే నీటిలో కొన్ని సహజమైన మూలికలు కలపడం వలన శరీరం శుభ్రంగా ఉండటమే కాకుండా మనసుకు కూడా తాజాదనం లభిస్తుంది.
పాతకాలం నుంచే ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ మూలికా స్నాన పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇంట్లో దొరికే సులభమైన వస్తువులతో హెర్బల్ బాత్ ఈజీగా చేసుకోవచ్చు.
తులసి ఆకులు నీటిలో కలపడం వల్ల శరీరానికి శుద్ధి లభిస్తుంది. ఇది చర్మంపై ఉన్న బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది.
వేప ఆకులు చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి.దురద, ఎలర్జీలు వంటి సమస్యలకు ఇది సహజ ఉపశమనం ఇస్తుంది.
పుదీనా ఆకులు నీటిలో కలపడం వల్ల శరీరానికి చల్లదనం కలుగుతుంది.వేసవి కాలంలో ఇది ఎక్కువగా ఉపశమనం ఇస్తుంది.
లావెండర్ వంటి సుగంధ మూలికలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.ఒత్తిడి తగ్గించి శరీరాన్ని, మనసుని మరింత రిలాక్స్‌గా మారుస్తాయి.
రోజ్మేరీ ఆకులు శరీరాన్ని ఉత్తేజపరచడంలో సహాయపడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ఇవి ఉపయోగపడతాయి.
పసుపు కలిపిన నీరు చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది.ఇది ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఈ మూలికలను కలిపిన స్నానం శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా శాంతిని ఇస్తుంది.