నేడు ఏపీ, తెలంగాణలో తీవ్రమైన ఎండలు కొనసాగనున్నాయి. ఐఎండీ హైదరాబాద్ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్‌లో నేడు 39°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావచ్చు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది.
తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41°C నుండి 44°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. జగిత్యాల, ఆదిలాబాద్‌లలో ఎండ తీవ్రత అధికం.
కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమలో ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 39°C నుండి 42°C వరకు ఉండవచ్చు.
రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు బయటకు రాకపోవడం మంచిది. తగినంత నీరు తాగుతూ ఆరోగ్యంగా ఉండండి.