వేసవి ప్రారంభం కాగానే ఇంట్లోనే వేడి తట్టుకోలేని పరిస్థితి వస్తోంది. ఫ్యాన్లు, కూలర్లు ఉన్నా సరే నిజమైన చల్లదనం మాత్రం అనిపించదు.
ఏసీ వాడకం పెరిగితే విద్యుత్ బిల్లులు కూడా భారంగా మారతాయి. పైగా ఎక్కువగా ఏసీలో ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది
అందుకే సహజంగా చల్లదనం ఇచ్చే మార్గాలు చాలా అవసరం అవుతున్నాయి. దీనికి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ బాగా ఉపయోగపడతాయి.
అరేకా పామ్ గాలిలో తేమను విడుదల చేసి గదిని చల్లగా ఉంచుతుంది. లివింగ్ రూమ్‌లో ఉంచితే సహజమైన చల్లదనం అందిస్తుంది.
కలబంద మొక్క వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. తక్కువ సంరక్షణతోనే పెరిగి ఇంటికి చల్లదనాన్ని ఇస్తుంది. ముల్లు లేని కలబంద వెరైటీస్ ఇండోర్లో బెస్ట్.
స్నేక్ ప్లాంట్ రాత్రివేళల్లో కూడా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. గాలిని శుభ్రంగా ఉంచి బెడ్‌రూమ్‌కు సరైన ఎంపికగా ఉంటుంది.
తులసి మొక్క గాలిని శుద్ధి చేసి మంచి సువాసన ఇస్తుంది. ఇది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది.
స్పైడర్ ప్లాంట్ గాలిలోని మలినాలను తొలగిస్తుంది. చిన్న కుండీల్లో కూడా సులభంగా పెంచుకుని చల్లదనం పొందవచ్చు.
ఫెర్న్ మొక్క తేమను పెంచి వేడిని తగ్గిస్తుంది. దాని ఆకులు గదిని మరింత సౌకర్యవంతంగా మార్చడంలో సహాయపడతాయి.