విభిన్న కథలతో సినిమాలను తీసే నటుడిగా అడివి శేష్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
శేష్ తాజాగా డెకాయిట్ అనే సినిమాను చేయగా, ఆ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
డెకాయిట్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న శేష్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు.
మేజర్ మూవీతో బాలీవుడ్ లో కూడా గుర్తింపు పొందాడు శేష్.
మేజర్ హిట్టవడంతో బాలీవుడ్ లో శేష్ కు పలు ఆఫర్లు వచ్చాయట.
మేజర్ తర్వాత బాలీవుడ్ మేకర్స్ తనకు 4 వార్ ఫిల్మ్స్, 2 బయోపిక్స్ ఆఫర్ చేశారని చెప్పాడు శేష్.
కానీ ఆ ఆఫర్లన్నింటినీ శేష్ రిజెక్ట్ చేసినట్టు చెప్పాడు.
తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన మేజర్ తరహాలోనే మళ్లీ సినిమాలు చేయడం బావుండదని వాటిని తిరస్కరించాడు శేష్.