ఏదైనా పని అవ్వలేదని లేదా ఆలస్యమవుతుందని ఉదయాన్నే చిరాకు పడుతున్నారా? ఆ చిన్న కోపం మీ రోజంతటినీ ఎలా పాడు చేస్తుందో తెలుసుకోండి.
లేట్ అయిపోతుందని కంగారు పడటం వల్ల మీ మెదడు 'ఫైట్ ఆర్ ఫ్లైట్' మోడ్‌లోకి వెళ్తుంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు జరుగుతాయి.
అనుకున్న టైమ్‌కి పాలు రాకపోవడమో లేదా టిఫిన్ రెడీ అవ్వకపోవడమో.. ఇలాంటి చిన్న చిన్న పనులు ఆగిపోయినప్పుడు కలిగే చిరాకు మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.
ఉదయాన్నే కోప్పడటం వల్ల మీ మెదడు రియాక్టివ్ స్టేట్‌లోకి వెళ్తుంది. దీనివల్ల ఆఫీస్‌లో లేదా ఇంట్లో ఎవరైనా చిన్న మాట అన్నా మీకు విపరీతమైన కోపం వస్తుంది.
ఒకసారి చిరాకు మొదలైతే, అది చైన్ రియాక్షన్‌లా మారుతుంది. ట్రాఫిక్ జామ్ అయినా, ఫోన్ కాల్ వచ్చినా ప్రతిదానికీ అసహనం కలుగుతుంది
కోపం మరియు చిరాకు మీ మానసిక శక్తిని త్వరగా ఖర్చు చేస్తాయి. మధ్యాహ్నం అయ్యేసరికి మీరు విపరీతమైన అలసటకు లోనవుతారు.
కళ్ళు మూసుకుని దీర్ఘ శ్వాస తీసుకోండి — మెదడు శాంతిస్తుంది. “లేట్ అయినా పర్వాలేదు” అని అనుకోండి. ఒక చిన్న పని పూర్తి చేసి control తిరిగి పొందండి.
చిన్న చిన్న పనుల కోసం మీ విలువైన రోజును బలి ఇవ్వకండి. ఒక్క దీర్ఘ శ్వాస తీసుకోండి, చిరునవ్వుతో రోజును ముందుకు సాగించండి