నిధి అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన నిధి, తక్కువ టైమ్ లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మున్నా మైఖేల్ మూవీతో బాలీవుడ్ కు పరిచయమైన నిధి, సవ్యసాచి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో నటించింది.
ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ గా నిలిచి నిధికి మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది.
పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చేయగా, ఆ సినిమా నిరాశను మిగిల్చింది.
దీంతో ప్రభాస్ తో చేసిన రాజా సాబ్ పైన నిధి ఆశల్ని పెట్టుకోగా, ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
సరైన సక్సెస్ లేక నిధి ఇప్పుడు సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది.