మ‌రో బంప‌రాఫ‌ర్ కొట్టేసిన రుక్మిణి !

27th March 2026

White Scribbled Underline

సప్త సాగ‌రాలు దాటి సినిమాల‌తో క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌తో పాటూ తెలుగు ఆడియ‌న్స్ ను కూడా విప‌రీతంగా ఆక‌ట్టుకుంది రుక్మిణి వ‌సంత్.

ఆ సినిమా త‌ర్వాత టాలీవుడ్ లో కూడా రుక్మిణికి బాగా క్రేజ్ ఏర్ప‌డింది.

స‌ప్త సాగ‌రాలు దాటి మూవీలో రుక్మిణి త‌న స‌హ‌జ న‌ట‌న‌తో ఎంతోమంది మ‌న‌సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.

క‌న్న‌డలో ప‌లు సినిమాల్లో న‌టించిన రుక్మిణికి ఇప్పుడు తెలుగులో ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి.

నిఖిల్ స‌ర‌స‌న అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీతో రుక్మిణి టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైంది.

ప్ర‌స్తుతం జూ. ఎన్టీఆర్ స‌ర‌స‌న డ్రాగ‌న్ అనే భారీ బ‌డ్జెట్ సినిమాలో న‌టిస్తోంది రుక్మిణి.

ఆ సినిమా రిలీజ‌వ‌క ముందే రుక్మిణికి ఇప్పుడు టాలీవుడ్ లో మ‌రో బంపరాఫ‌ర్ ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది.

రామ్ చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోయే సినిమాలో రుక్మిణికి ఛాన్స్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.