ఈ ఒక్క మార్పు చేస్తే… సమ్మర్‌లో దురద, ఇన్ఫెక్షన్ రాదు!

24th March 2026

White Scribbled Underline

సమ్మర్ సీజన్ లో చర్మం ఎర్రగా కందిపోవడం, దురద, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లు సమస్యగా మారవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే చర్మానికి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

స్నానం చేసిన తర్వాత మృదువైన క్రీమ్ ఉపయోగించడం చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇది చెమట వల్ల ఏర్పడే ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది.

చర్మం ఎర్రగా కందిపోయిన చోట చల్లని నీటితో తడపడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇది మంట మరియు దురద వంటి వాటిని తగ్గిస్తుంది

హార్ష్ సబ్బులు, ఎక్కువ రసాయనాలు ఉన్న కాస్మెటిక్ ఉత్పత్తులు వాడకండి. ఇవి చర్మ సమస్యలను పెంచవచ్చు.

తీపి, మసాలా, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం తగ్గించడం ద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

ఎండలో ఎక్కువగా ఉండకండి. కొంత సమయం బయట ఉండడం చర్మానికి అవసరం, కానీ ఎండ తీవ్రంగా ఉన్న టైమ్ లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచండి. మృదువైన యాంటీసెప్టిక్ సొల్యూషన్ ఉపయోగించడం మంచిది.

తగిన జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం రాలేదంటే డాక్టర్ ను సంప్రదించి మందులు, క్రీమ్ వాడడం ఉత్తమం.