పర్ఫ్యూమ్ అనేది కేవలం సువాసన మాత్రమే కాదు, అది మన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. సరైన పరిమళం మన మూడ్‌ను మార్చి రోజంతా ఫ్రెష్‌గా ఉంచుతుంది.
లగ్జరీ పరిమళాలు ఇష్టపడే వారికి వర్సాచే, హ్యూగో బాస్, అర్మాని వంటి బ్రాండ్లు మంచి ఎంపికగా ఉంటాయి. వీటి సువాసనలు క్లాసీగా ఉండి ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి.
అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన గూచీ, మాంట్బ్లాంక్, కోచ్ వంటి బ్రాండ్ల పర్ఫ్యూమ్స్ కూడా ఎలిగెంట్ ఫ్రాగ్రెన్స్ కోసం చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ఇవి లాంగ్ లాస్టింగ్ పరిమళం అందిస్తాయి.
మూడ్ లిఫ్టర్లా పనిచేసే కొన్ని ప్రత్యేక పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. అందులో బ్లాక్ ఓపియం తన స్ట్రాంగ్ , రిచ్ సువాసనతో ప్రత్యేకంగా నిలుస్తుంది.
అలాగే ఫ్రెష్ ,ఎనర్జిటిక్ ఫీలింగ్ కోసం డిలన్ బ్లూ మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఇది రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.
క్లాసిక్ ఫ్రాగ్రెన్స్ కోరుకునేవారికి సిల్వర్ సెంట్ కూడా మంచి ఎంపిక. దీని పరిమళం సాఫ్ట్‌గా ఉండి చాలా సమయం పాటు నిలుస్తుంది.
ఇటీవల భారతీయ బ్రాండ్ల పర్ఫ్యూమ్స్ కూడా మంచి గుర్తింపు పొందుతున్నాయి. అందులో బెల్లా విటా బ్రాండ్ తక్కువ ధరలో మంచి సువాసనలు అందిస్తోంది.
అలాగే సమంతా బ్రాండ్ పర్ఫ్యూమ్స్ కూడా యువతలో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి ట్రెండీ ఫ్రాగ్రెన్స్తో పాటు రోజువారీ వాడకానికి కూడా అనుకూలంగా ఉంటాయి.