పరాభవ నామ సంవత్సరం కుంభ రాశి వార్షిక ఫలితాలు

కుంభ రాశి వారికి ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరమయ్యే కాలంగా ఉంటుంది. పట్టుదలతో, క్రమపద్ధతిగా ముందుకు సాగితే ఫలితాలు వస్తాయి.

ఈ సంవత్సరం కుంభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8 గా సూచించబడింది. రాజపూజ్యం 4, అవమానం 2.

ఉద్యోగంలో కొన్ని మార్పులు, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.

ఈ రాశి వారికి పుత్ర సంతానయోగంతో పాటు వంశాభివృద్ధి కూడా కనిపిస్తోంది. గతంలో పెండింగ్ పడిన ఎన్నో పనులు పూర్తవుతాయి.

ఆర్థిక పరంగా ఖర్చులను నియంత్రించడం అవసరం. అవసరంలేని ఖర్చులు తగ్గించాలి. ఇన్వెస్ట్మెంట్ చేసే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది.

కుటుంబ సంబంధాలు బలపడే అవకాశం ఉంది. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి నుంచి అనుకొని లాభం కలిసి వస్తుంది.

ప్రయాణాలు ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. గురు గ్రహానికి సంబంధించిన శాంతి హోమాలు, పూజలు చేయించడం ఈ రాశి వారికి మంచిది.

CLICK HERE