ఇటీవలి సంవత్సరాల్లో ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం దీనికి ప్రధాన కారణంగా మారుతోంది.
చిప్స్, బిస్కెట్లు, ప్యాకెట్ స్నాక్స్, ఫ్రోజెన్ ఫుడ్స్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ రోజువారీ ఆహారంలో భాగమవుతున్నాయి. ఇవి రుచిగా ఉన్నా ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం.
ఈ ఫుడ్స్‌లో అధికంగా చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు నిల్వలను పెంచి ఊబకాయానికి దారితీస్తాయి.
ఇవి తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండదు. అందుకే మరింతగా తినాలనిపించి అవసరానికి మించి కాలరీలు తీసుకుంటారు.
శ్వాస ఇబ్బంది, అలసట, మోకాళ్ళ నొప్పి, నిద్రలో గురక, నిరాశ — ఇవి ఊబకాయం ప్రధాన హెచ్చరిక లక్షణాలు.
BMI 25–29.9 అధిక బరువు, 30–34.9 క్లాస్ 1, 35–39.9 క్లాస్ 2, 40పైన క్లాస్ 3 ఒబేసిటీ అవుతుంది.
BMI కొలత, నడుము సైజు, రక్త పరీక్షల ద్వారా డాక్టర్ ఊబకాయాన్ని నిర్ధారిస్తారు. ఏటా చెకప్ అవసరం. నడుము కొలత పురుషులకు 90 సెం.మీ., మహిళలకు 80 సెం.మీ. మించకూడదు.
దీర్ఘకాలంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటే గుండె జబ్బులు, డయాబెటిస్, హై బీపీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఈ సమస్యలను తగ్గించాలంటే ఇంటి వంటలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఫాస్ట్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడం చాలా అవసరం.
సమతుల్యమైన ఆహారం మరియు రోజువారీ వ్యాయామం ద్వారా ఊబకాయాన్ని నియంత్రించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి మాత్రమే దీర్ఘకాల ఆరోగ్యానికి కీలకం.