కళ్ల కింద నల్లటి వలయాలు చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. నిద్రలేమి, ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఈ వలయాలను తగ్గించుకోవచ్చు.
దోసకాయ ముక్కలను కళ్లపై ఉంచడం మంచి ఉపాయం. 10–15 నిమిషాలు ఉంచితే కళ్లకు చల్లదనం కలిగి నల్లటి వలయాలు తగ్గేందుకు సహాయపడుతుంది.
చల్లటి టీ బ్యాగ్‌లు కూడా ఉపయోగపడతాయి. వాటిని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి కళ్లపై పెట్టుకుంటే కళ్ల చుట్టూ ఉన్న నలుపు తగ్గే అవకాశం ఉంటుంది.
బాదం నూనెను రాత్రి సమయంలో కళ్ల కింద మృదువుగా మర్దన చేయడం మంచిది. ఇది చర్మానికి పోషణ ఇచ్చి నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
పాలు కూడా ఈ సమస్యకు సహజ చికిత్సగా పనిచేస్తాయి. పాలలో ముంచిన కాటన్ బాల్స్ కళ్ల పై పెట్టుకుంటే చర్మం తాజాగా కనిపిస్తుంది.
అలోవెరా జెల్‌ను రాత్రి సమయంలో కళ్ల కింద రాసి కొద్దిసేపు ఉంచినా మంచిది. ఇది చర్మానికి తేమ అందించి నల్లటి వలయాలు తగ్గేందుకు సహాయపడుతుంది.
వీటితో పాటుగా ఫేస్ యోగ ,బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల సహజంగా కంటి కింద నల్లటి వలయాలు తగ్గుతాయి.