తెల్ల జుట్టు ఆపాలంటే ముందు ఇది మార్చండి!

12th March 2026

White Scribbled Underline

తెల్ల జుట్టు సమస్య ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తోంది. ఒత్తిడి, పోషకాహారం లోపం, కాలుష్యం వంటి కారణాలతో జుట్టు త్వరగా తెల్లబడే అవకాశం ఉంటుంది.

చిన్నతనం నుంచే చాలామంది తెల్ల జుట్టును కవర్ చేయడానికి కెమికల్స్ తో కూడిన హెయిర్ డై వాడుతున్నారు. అయితే సహజ నూనెల మిశ్రమం ఉపయోగించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

కరివేపాకు, ఉసిరికాయ, మెంతులు, కలొంజి జుట్టుకు మంచి పోషణ ఇస్తాయి. ఇవి జుట్టు వేర్లను బలంగా చేసి జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడతాయి.

ఈ నూనె తయారు చేయడానికి ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకోవాలి. అందులో ఒక బౌల్ కరివేపాకు, ఒక చెంచా మెంతులు, ఒక చెంచా కలొంజి గింజలు , కొద్దిగా ఉసిరికాయ ముక్కలు వేయాలి.

తర్వాత ఈ మిశ్రమాన్ని మెల్లగా మరిగించాలి. వేసిన దినుసులు కాస్త నల్లగా మారిన తర్వాత నూనెను దింపి చల్లారనివ్వాలి.

చల్లారిన తర్వాత వడగట్టి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారైన నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు తలకు మృదువుగా మర్దన చేయాలి.

దాదాపు 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా క్రమంగా ఉపయోగిస్తే జుట్టు బలంగా మారి తెల్ల జుట్టు సమస్య తగ్గేందుకు సహాయపడుతుంది.

CLICK HERE