వేసవిలో ఆరోగ్యానికి వరం తాటి ముంజలు

11th March 2026

White Scribbled Underline

మార్చి నుండి మే వరకు వేసవి కాలంలో ఎక్కువగా లభించే సహజమైన చల్లని ఆహారం తాటి ముంజలు. ఇవి తాటి చెట్టులో నుండి వచ్చే తీయని, మృదువైన గుజ్జుతో ఉండే ఫలాలు.

తాటి ముంజలు శరీరానికి చల్లదనం ఇచ్చే సహజ ఆహారం. వేసవిలో ఎక్కువగా తింటే దాహం తగ్గి శరీరం హైడ్రేట్‌గా ఉండటానికి సహాయపడతాయి.

విటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు విటమిన్లు, ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడంలో ఇవి ఉపయోగపడతాయి.

తాటి ముంజలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. వేసవిలో వచ్చే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.

వేసవిలో వచ్చే అలసట, శరీర వేడి తగ్గించడానికి తాటి ముంజలు మంచి ఎంపికగా భావిస్తారు. ఇవి తినడం వల్ల శరీరానికి తేలికగా, తాజాగా అనిపిస్తుంది.

సహజమైన తీపి రుచితో ఉండే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవి కాలంలో వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

CLICK HERE