ఇప్పుడు తెలుగు కుర్రాళ్ల కొత్త క్రష్ గా భాగ్య శ్రీ బోర్సే కి మంచి గుర్తింపే ఉంది.
మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన భాగ్యశ్రీ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను దక్కించుకుంది.
మొదటి సినిమాతోనే గ్లామర్ షో తో యూత్ ను కట్టిపడేసిన భాగ్యశ్రీ కి ఆ సినిమా పెద్దగా ఉపయోగపడలేదు.
మిస్టర్ బచ్చన్ తర్వాత విజయ్ తో కింగ్‌డమ్, దుల్కర్ తో కాంత, రామ్ తో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలు చేసింది భాగ్యశ్రీ.
ఇప్పటివరకు అమ్మడు పలు సినిమాలు చేసినప్పటికీ వాటిలో ఏదీ బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకున్నది లేదు.
ప్రస్తుతం భాగ్యశ్రీ, అఖిల్ తో కలిసి లెనిన్ మూవీ చేస్తుండగా, ఈ మూవీపైనే అమ్మడు తన ఆశలన్నింటినీ పెట్టుకుంది.
ప్రతి సినిమాలో కొత్త లుక్ తో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.