టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పెళ్లి పీటలెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఉదయపూర్ లోని ఓ ప్రముఖ రిసార్ట్స్ లో వీరి పెళ్ళి అత్యంత ఘనంగా జరగనుంది.
ఈ పెళ్లి కోసం ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్ కు చేరుకోగా, పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉదయపూర్ కు వెళ్తున్నారు.తాజాగా విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీ ఒకటి ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
తమ పెళ్లికి విరోష్ అనే ట్యాగ్ ను పెట్టుకున్న ఈ జంట, అదే పేరుతో ఓ ఇమేజ్ ను షేర్ చేశారు.
విరోష్ ప్రీమియర్ లీగ్ అంటూ క్రికెట్ బ్యాట్, పాప్ కార్న్ డబ్బా, బ్యాట్ పై ఫిబ్రవరి 26 అనే డేట్ ఉన్న ఫోటోను విజయ్ షేర్ చేశాడు.
దీంతో విజయ్, రష్మికలు తమ పెళ్లిని ఎంత స్పెషల్ గా ప్లాన్ చేశారనేది అర్థమవుతుంది. అయితే ఈ ప్రీమియర్ లీగ్ అంటే ఏంటో తెలియాల్సి ఉంది.
ఇప్పటికే ఎన్నోసార్లు కలిసి కనిపించిన Vijay Deverakonda–Rashmika Mandanna జంటపై సోషల్ మీడియాలో ఫ్యాన్ క్రేజ్ పీక్‌లో ఉంది. తాజాగా షేర్ చేసిన ఈ ఇమేజ్ ఆ ఆసక్తిని మరింత పెంచింది.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నాని ఆయా షేర్ సాంగ్
ఆస్ట్రాలజర్ విరోష్ కపుల్ భవిష్యత్తు.....