విరోష్ వెడ్డింగ్ స్పెషల్ మెనూ ఏంటో తెలుసా?

24th February 2026

White Scribbled Underline

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక క‌లిసి న‌టించిన మొద‌టి సినిమా గీత గోవిందంతోనే మంచి ఆన్ స్క్రీన్ పెయిర్ గా పాపుల‌ర్ అయ్యారు.

ఆ సినిమా నుంచే ప్రేమ‌లో ఉన్న ర‌ష్మిక‌, విజ‌య్ కెరీర్లో ఎవ‌రికి వారు బిజీగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే.

గ‌తేడాది సీక్రెట్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వీరిద్ద‌రూ ఫిబ్ర‌వ‌రి 22న త‌న బంధాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఫిబ్ర‌వ‌రి 26న రాజ‌స్థాన్ లోని ఉద‌య‌పూర్ లో వీరి పెళ్లి జ‌ర‌గ‌నుండ‌గా, ఈ పెళ్లికి అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌వుతున్నారు.

ర‌ష్మిక‌, విజ‌య్ పెళ్లిలో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న కొన్ని స్పెష‌ల్ జ‌ప‌నీస్ వంట‌కాల‌ను వ‌డ్డించ‌బోతున్నట్టు తెలుస్తోంది.

పెళ్లి వేడుకలో సాంప్రదాయ దక్షిణాది వంటకాలతో పాటు ఫ్యూజన్ క్యూజిన్ కూడా ఉండబోతుందట.

అతిథులకు ప్రత్యేకంగా కస్టమైజ్డ్ స్వీట్స్ మరియు రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి త‌మ పెళ్లి భోజ‌నం విష‌యంలో కూడా ర‌ష్మిక‌, విజ‌య్ స్పెష‌ల్ కేర్ తీసుకోవ‌డం చూస్తుంటే ఈ వేడుక‌ను వారెంత స్పెష‌ల్ గా మార్చుకోవాల‌నుకుంటున్నార‌నేది స్ప‌ష్ట‌మ‌వుతుంది. 

ఫాలో అవ్వండి.

Sugar Control: షుగర్ పేషెంట్లు ఉదయం .....

చిరంజీవి సొంత ఊరు మొగల్తూరు ........