ఎగ్ లేకుండా కూడా సాఫ్ట్ కేక్ తయారు చేయడం చాలా సులభం. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే స్పాంజీగా, రుచిగా కేక్ చేసుకోవచ్చు.
మొదట ఒక కప్పు మైదా, అరకప్పు చక్కెర, అరకప్పు పెరుగు తీసుకోవాలి. వీటిలో కొద్దిగా నూనె, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.
మిశ్రమం చాలా గట్టిగా లేకుండా మృదువుగా ఉండాలి. అవసరమైతే కొద్దిగా పాలు వేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేలా కలపాలి.
తయారైన మిశ్రమాన్ని గ్రీస్ చేసిన కేక్ టిన్‌లో పోయాలి. ముందుగా వేడి చేసిన ఓవెన్లో 180°C వద్ద సుమారు 30–35 నిమిషాలు బేక్ చేయాలి.
కేక్ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్‌పిక్‌ను మధ్యలో దింపాలి. అది శుభ్రంగా బయటకు వస్తే కేక్ రెడీ అయినట్టే, మిశ్రమం అంటుకుని వస్తే ఇంకొన్ని నిమిషాలు బేక్ చేయాలి.
ఓవెన్ లేకపోతే ప్రెజర్ కుక్కర్లో కూడా తయారు చేయవచ్చు. కుక్కర్లో ఉప్పు వేసి వేడి చేసి, స్టాండ్‌పై టిన్ పెట్టి సుమారు 40 నిమిషాలు ఉంచాలి.
కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత బయటకు తీసి కట్ చేసుకోవాలి. ఇలా ఎగ్ లేకుండానే సాఫ్ట్, టేస్టీ కేక్‌ను ఆస్వాదించవచ్చు
కేక్ మరింత టేస్టీగా ఉండటానికి పైన జీడిపప్పు, బాదం పలుకులు లేదా టూటీ ఫ్రూటీని అలంకరించుకోవచ్చు.
తిరుపతి లడ్డూ రహస్యాలు
ఫిబ్రవరి 19, 2025 గురువారం రాశిఫలాలు