ఇటీవలి కాలంలో ప్రేమ వ్యవహారాలు, కుటుంబ విభేదాల కారణంగా పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి.
అయితే హైదరాబాద్‌లో స్నేహితులకు చికెన్ వడ్డించలేదనే కారణంతో ఓ వివాహం నిలిచిపోవడం చర్చనీయాంశమైంది.
షాపూర్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనలో జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీకి చెందిన వరుడు, కుత్బుల్లాపూర్‌కు చెందిన వధువుతో వివాహం జరగాల్సి ఉంది. ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి ఘనంగా విందు ఏర్పాటు చేశారు.
వధువు కుటుంబం బిహార్‌కు చెందిన మార్వాడీ శాకాహార కుటుంబం కావడంతో విందులో పూర్తిగా వెజ్ వంటకాలే వడ్డించారు.
విందు ముగింపు సమయంలో వరుడి స్నేహితులు భోజనానికి వచ్చి చికెన్ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ విషయం క్రమంగా ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. వరుడు కూడా స్నేహితులకు నాన్‌వెజ్ వడ్డించాల్సిందేనని పట్టుబట్టడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో వివాహ కార్యక్రమం నిలిచిపోయింది. వెంటనే వధువు కుటుంబ సభ్యులు జీడిమెట్ల పోలీసులను సంప్రదించారు.
పోలీసులు ఇరు కుటుంబాలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు
అనంతరం పరస్పర అంగీకారంతో ఈ నెల 30న వివాహం నిర్వహించుకోవాలని నిర్ణయానికి వచ్చారు.
మహాశివరాత్రి 2026 పూజా సమయాలు,
ఫిబ్రవరి 16 – ఈ రోజు రాశి ఫలాలు