విశాఖపట్నంలో విలాస జీవితానికి అలవాటుపడి బీఎండబ్ల్యూ కారులో తిరుగుతూ దొంగతనాలు చేసిన మహేష్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు.
విశాఖ, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో మొత్తం 62 దొంగతనాలు చేసి సుమారు కోటి రూపాయల సొమ్ము దోచుకున్నాడు.
బంగారం, వెండి, నగదు రూపంలో ఉన్న ఆస్తిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.
15 ఏళ్ల వయసు నుంచే మహేష్ రెడ్డి దొంగతనాల బాట పట్టినట్లు విచారణలో బయటపడింది.
రాత్రి వేళల్లో ఖాళీ ఇళ్లను గుర్తించి ముఖానికి మాస్క్ వేసుకొని చోరీలు చేసి మరుసటి రోజు నగరం మారేవాడు.
ఇంట్లో వాళ్లకే కాదు, సొంత భార్యకూ కూడా తాను చేస్తున్న పనిపై సమాచారం లేకుండా సినిమాల మాదిరిగా చాకచక్యంగా వ్యవహరించాడు.
సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.