ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు టెంపుల్ సర్క్యూట్ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే ప్యాకేజీలో అనుసంధానించనుంది.
3-4 రోజుల ప్రత్యేక టూర్లలో రవాణా, వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. యాత్రికులకు సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు ఉంటాయి.
ఒక్కో సర్క్యూట్‌లో 6 నుండి 10 దేవాలయాలు ఉండేలా మార్గాలు సిద్ధం చేస్తున్నారు. గైడ్‌తో కూడిన సమగ్ర ప్యాకేజీలు అందుబాటులోకి రానున్నాయి.
తిరుపతి, పంచారామాలు, నల్లమల, ఉత్తరాంధ్ర ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక రూట్లు రూపొందిస్తున్నారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేక ఆధ్యాత్మిక పథకాలు సిద్ధమవుతున్నాయి.
టెంపుల్ టూరిజం కారవాన్ సేవలు, ఆన్‌లైన్ టికెటింగ్ సౌకర్యాలు అందించనున్నారు. డిజిటల్ విధానాలతో బుకింగ్ సులభతరం చేయనున్నారు.
ఈ టెంపుల్ సర్క్యూట్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
ఈ ప్రణాళిక ద్వారా యాత్రికులకు సురక్షితమైన ప్రయాణం కల్పించడం లక్ష్యం. స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది తోడ్పడనుంది.
మహాశివరాత్రి 2026 పూజా సమయాలు,
2026లో ట్రెండ్ సెట్ చేయబోయే గ్యాడ్జెట్స్..