కంటెంట్ ఉన్న సినిమాలకు కటౌట్ అక్కర్లేదని ప్రూవ్ చేయడానికి అప్పుడప్పుడు కొన్ని సినిమాలు వస్తుంటాయి.
అలాంటి సినిమాల్లో రీసెంట్ గా వచ్చిన విత్ లవ్ ఒకటి. ఫిబ్రవరి 6న తమిళంతో పాటూ తెలుగులో కూడా ఈ సినిమా రిలీజైంది.
అభిషన్ జీవింత్, అనస్వర్ రాజన్ జంటగా నటించిన ఈ మూవీ రోజురోజుకీ మరింత పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది.
మొదటి మూడు రోజుల్లోనే రూ.11 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా లాభాల బాటలో పయనిస్తోంది.
కొత్త డైరెక్టర్ మధన్ దర్శకత్వంలో సౌందర్య రజినీకాంత్, మగేష్ రాజ్ పసిలియన్ జంటగా విత్ లవ్ ను నిర్మించారు.
ఈ సినిమాకు మొత్తం రూ.4 కోట్ల బడ్జెట్ అవగా, మొదటి మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను అందుకుంటుంది.
కథ, భావోద్వేగాలు, సహజ నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా మారాయి.
కంటెంట్ బేస్డ్ సినిమాలకు మార్కెట్ ఉందని మరోసారి నిరూపించిన చిత్రంగా With Love నిలుస్తోంది