2026లో పలు భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి. రానున్న సినిమాల లిస్ట్ చూస్తుంటే ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ సందడి నెలకొనడం ఖాయంలా కనిపిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఉస్తాద్ భగత్‌సింగ్ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కార్తికేయ2 తర్వాత నిఖిల్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ స్వయంభు ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
రామ్ చరణ్ పెద్ది ఏప్రిల్ 30న రిలీజ్ కానుండగా, చిరంజీవి విశ్వంభర మే నెలలో రిలీజయ్యే అవకాశాలున్నాయి.
జూ.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న డ్రాగన్ సినిమా జూన్ లో రానున్నట్టు చెప్పారు కానీ కాస్త వాయిదా పడినా ఈ ఏడాదిలోనే రిలీజ్ ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్ ఆగస్ట్ 21న రిలీజ్ కానుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైసా మూవీ కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.