వాట్సప్ వినియోగదారులకు మరో కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు మొబైల్ లేదా డెస్క్‌టాప్ యాప్‌లో మాత్రమే ఉన్న కాలింగ్ ఫీచర్ ఇప్పుడు వెబ్‌లోకి వచ్చింది.
ఇక నుంచి బ్రౌజర్ ద్వారానే వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. వాట్సప్ వెబ్ వాడే వారికి ఇది చాలా సౌకర్యంగా మారనుంది.
ఆఫీస్ పనులు చేసే ఉద్యోగులు, రోజంతా ల్యాప్‌టాప్ వాడే విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. ప్రతి సారి మొబైల్ తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది.
ప్రస్తుతం వన్ టూ వన్ వాయిస్, వీడియో కాల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఈ అప్‌డేట్ అందరికీ పూర్తిగా విడుదల కానుంది.
ఈ కాల్స్‌కు ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ డీఫాల్ట్‌గా అమల్లో ఉంటుంది. మీరు మాట్లాడే విషయాలు భద్రంగా ఉంటాయని కంపెనీ చెబుతోంది.
భవిష్యత్తులో 32 మంది గ్రూప్ వీడియో కాల్స్, కాల్ లింక్ షేర్, స్క్రీన్ షేరింగ్ వంటి ఫీచర్లు రానున్నాయి. ఇవి ఉద్యోగులు, విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉండనున్నాయి.
ఈ ఫీచర్ ఉపయోగించడానికి అదనపు సాఫ్ట్‌వేర్ అవసరం లేదు, నేరుగా WhatsApp Web ఓపెన్ చేస్తే సరిపోతుంది.
వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసులకు ఈ అప్‌డేట్ ఎంతో సహాయపడుతుంది.