ఫోన్ వాడుతున్నప్పుడు అకస్మాత్తుగా స్లో అవుతోంది అని చాలామంది ఆలోచిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం కొన్ని యాప్స్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
బ్యాక్‌గ్రౌండ్‌లో ఎప్పటికప్పుడు రన్ అయ్యే యాప్స్ ఫోన్ మెమరీని ఎక్కువగా వినియోగిస్తాయి. దీని వల్ల ఫోన్ పనితీరు స్లో అవుతుంది.
సోషల్ మీడియా, గేమింగ్, షాపింగ్ యాప్స్ ఎక్కువ స్టోరేజ్‌తో పాటు ర్యామ్‌ను కూడా ఆక్రమిస్తాయి. ఇవి తరచూ అప్డేట్స్ తీసుకోవడం వల్ల ఫోన్ పై భారం పెరుగుతుంది.
అవసరం లేని యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం కూడా ఫోన్ స్లో కావడానికి మరో కారణం. ఒకసారి ఉపయోగించి మరిచిపోయిన యాప్స్ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంటాయి.
ఫోన్ వేగంగా పనిచేయాలంటే ఉపయోగం లేని యాప్స్‌ను తొలగించడం మంచిది. అలాగే యాప్స్ క్యాష్ క్లియర్ చేయడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
కాలానుగుణంగా ఫోన్ స్టోరేజ్‌ను శుభ్రం చేసుకుంటే పనితీరు మెరుగవుతుంది. సరైన యాప్ వినియోగంతో ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది.