జాతిరత్నాలు మూవీతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ఫరియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే స్టార్ అయిపోయింది.
తన అందం, అభినయంతో ఎంతోమందిని మెప్పించిన ఫరియా, తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది.
ఫరియా టాలెంటెడ్ హీరోయిన్ అయినప్పటికీ తన హైట్ కారణంగా అమ్మడికి ఎక్కువ అవకాశాలు రావడం లేదనేది సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే ఓ కామెంట్.
ప్రస్తుతం ఫరియా, తిరువీర్ హీరోగా వస్తున్న భగవంతుడు సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి మెప్పించనుందంటున్నారు.
మరి భగవంతుడు మూవీ అయినా ఈ తెలుగమ్మాయికి మంచి బ్రేక్ ఇచ్చి, తనకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తుందేమో చూడాలి.