జాబ్ ఇంటర్వ్యూలో మంచి ఫలితం రావాలంటే ముందస్తు జాగ్రత చాలా అవసరం, అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
మీ గురించి చెప్పమని అడిగినప్పుడు సంక్షిప్తంగా, క్రమబద్ధంగా మీ పరిచయాన్ని వివరించడం మీ పైన మంచి ఇంప్రెషన్‌ను కలిగిస్తుంది.
మీ బలాలను స్పష్టంగా తెలియజేస్తూ, బలహీనతలను మెరుగుపర్చుకునేందుకు తీసుకుంటున్న చర్యలను చెప్పాలి.
కంపెనీని ఎందుకు ఎంపిక చేసుకున్నారో చెప్పడానికి దాని లక్ష్యాలు, పనితీరుపై ముందే అవగాహన కలిగి ఉండాలి.
గత అనుభవాలు, ప్రాజెక్టుల గురించి మాట్లాడేటప్పుడు మీ బాధ్యతలు , సాధించిన ఫలితాలను స్పష్టంగా వివరించాలి.
ఇంటర్వ్యూ చివరలో ధైర్యంగా స్పందిస్తూ, సంస్థ గురించి సమంజసమైన ప్రశ్నలు అడగడం మీ ప్రొఫెషనలిజాన్ని చూపిస్తుంది.