గూగుల్‌ను రోజూ ఉపయోగిస్తున్నా, దానిలో ఉన్న కొన్ని స్మార్ట్ ట్రిక్స్ చాలామందికి తెలియవు.ఆ చిన్న ట్రిక్స్ తెలుసుకుంటే గూగుల్ లో చాలా ఈజీగా సెర్చ్ చేయవచ్చు.
ఫొటో ఆధారంగా సమాచారం తెలుసుకోవాలంటే రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి చిత్రానికి సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
ఒక పదానికి అర్థం లేదా వాతావరణ సమాచారం కావాలంటే సెర్చ్‌లో డిఫైన్ (Define) లేదా వెదర్ (Weather) టైప్ చేస్తే వెంటనే ఫలితాలు వస్తాయి.
కేల్క్యులేషన్‌లు చేయడం, కరెన్సీ లేదా యూనిట్స్ మార్పులు చేసుకోవాలంటే ప్రత్యేక యాప్ అవసరం లేకుండా గూగుల్‌లోనే చేయవచ్చు.
ప్రస్తుతం ఏ విషయాలు ట్రెండ్ అవుతున్నాయో తెలుసుకోవడానికి గూగుల్ ట్రెండ్స్ మంచి సాధనంగా ఉపయోగపడుతుంది.
ఈ చిన్న చిట్కాలను ఉపయోగిస్తే గూగుల్ మీ రోజువారీ పనుల్లో మరింత వేగం, సౌలభ్యం అందిస్తుంది.