రోజూ ఎక్కువగా పచ్చళ్లు తినడం వల్ల కొందరికి జీర్ణక్రియ సమస్యలు రావచ్చు, ఎందుకంటే అవి సరిగా జీర్ణం కాక కడుపు ఉబ్బరం కలిగించవచ్చు.

పచ్చళ్లు ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, పొట్ట నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు డైలీ పచ్చలు తినకూడదు.

కొన్ని రకాల పచ్చళ్లు శరీరంలో ఇనుము శోషణను తగ్గించవచ్చు, దీంతో దీర్ఘకాలంలో రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంటుంది.

రోజూ కేవలం పచ్చళ్ల మీదే ఆధారపడితే శరీరానికి కావాల్సిన పూర్తి పోషకాలు అందక బలహీనత అనిపించవచ్చు.

పచ్చళ్లలో ఎక్కువగా నూనె ఉపయోగిస్తారు. కాబట్టి ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అందుకే పచ్చళ్లు వీలైనంత తక్కువగా తినడం మంచిది.