ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా ఫ్రెష్ పుచ్చ కాయలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్ క్రమం తప్పకుండా పుచ్చకాయ తినడం ఎంత మేలు చేస్తుందో తెలుసా?
వేసవిలో ఎక్కువగా తినే పుచ్చకాయ శరీరానికి చల్లదనం ఇచ్చి దాహాన్ని వెంటనే తీరుస్తుంది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది.
ఇది జీర్ణక్రియను మెరుగుపరచి కడుపు సమస్యలు, మలబద్ధకం తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపు మంట తగ్గించి ఇది గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది.
పుచ్చకాయలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. సమ్మర్ లో డైలీ పుచ్చకాయ తినడం వల్ల స్కిన్ ఫ్రెష్ గా హెల్తీగా మారుతుంది.
తక్కువ కేలరీలు ఉండటంతో బరువు తగ్గాలనుకునేవారికి పుచ్చకాయ మంచి ఎంపిక. మితంగా పుచ్చకాయ తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడి శరీరానికి సహజ శక్తి లభిస్తుంది.