తలకింద పెట్టుకునే దిండు పరిమాణం మెడ కండరాల పై ప్రభావం చూపుతుంది అని మీకు తెలుసా? దిండు సైజ్ కరెక్ట్ గా లేకపోతే మెడ నొప్పి మొదలవుతుంది. మెడకు కరెక్ట్ సపోర్ట్ లేకపోతే నరాలు, కండరాలపై ఒత్తిడి పడుతుంది.
చాలా ఎత్తుగా ఉన్న దిండు వాడితే మెడ ముందుకు వంగినట్టుగా ఉండి, ఉదయం లేవగానే మెడ బిగుసుకుపోయినట్టు, నొప్పిగా అనిపిస్తుంది.
అలాగే చాలా పలుచని లేదా చిన్న దిండు వాడినప్పుడు మెడ కింద ఖాళీ ఉండిపోతుంది, దీంతో మెడ వెనుక కండరాల పై భారం పడి నొప్పి వస్తుంది.
దిండు పరిమాణం మీ కంఫర్ట్ ప్రకారం ఉంటుంది. కరెక్ట్ దిండు వాడితే భుజం నుంచి మెడ వరకు నేరుగా ఉండేలా సహాయం చేస్తుంది.
సరైన పరిమాణం, మృదుత్వం ఉన్న దిండు వాడితే మెడ నొప్పి తగ్గడమే కాకుండా నిద్ర నాణ్యత కూడా మెరుగవుతుంది, అందుకే దిండు ఎంపికను చిన్న విషయం అనుకోకూడదు.
మంచి దిండు మంచి నిద్రకు ,భుజాల టెన్షన్ తగ్గించి మీ పోస్చర్ కరెక్ట్ గా ఉంచడానికి సహపడుతుంది.