తెలుగమ్మాయి ఈషా రెబ్బా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
ఓ వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్లో ముందుకెళ్తుంది.
రీసెంట్ గా తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈషా.
అయితే గత కొంత కాలంగా ఈషా రిలేషన్షిప్ లో ఉందని, అతన్నే పెళ్లి చేసుకుంటుందని వార్తలొస్తున్నాయి.
డైరెక్టర్ కం యాక్టర్ తరుణ్ భాస్కర్ తో ఈషా రెబ్బా ప్రేమలో ఉందని, త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకుంటుందని గట్టిగా టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ వార్తలపై రీసెంట్ గా తరుణ్ భాస్కర్ రియాక్ట్ అయి, సరైన టైమ్ చూసుకుని క్లారిటీ ఇస్తానని చెప్పాడు.