సాధారణంగా నిమ్మరసం తీసుకున్న తర్వాత తొక్కను వృథాగా పారేస్తాం కానీ, నిపుణుల మాటలో చెప్పాలంటే నిమ్మ తొక్కలోనే ఎక్కువ పోషకాలు దాగి ఉంటాయి.
నిమ్మ తొక్కను నేరుగా తినలేకపోయినా, దాన్ని తురిమి సలాడ్లు, పెరుగు లేదా సూప్‌లలో కలిపి తీసుకుంటే శరీరానికి మేలు జరుగుతుంది.
నిమ్మ తొక్కలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను బలపరచి గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎండపెట్టిన నిమ్మ తొక్క పొడి వాడటం వల్ల మొటిమలు తగ్గి, చర్మంపై ఉన్న మచ్చలు క్రమంగా తగ్గుతూ ముఖానికి కాంతి వస్తుంది.
నిమ్మకాయ తొక్కలను నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే శరీరంలోని అదనపు కొవ్వు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది.
నిమ్మ తొక్కలోని శక్తివంతమైన సమ్మేళనాలు రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు కొన్ని తీవ్రమైన వ్యాధులను ఎదుర్కొనే శక్తిని పెంచుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.