తలనొప్పి అందరికీ ఒక్క రకంగా ఉండదు. కారణాన్ని బట్టి తలనొప్పులు వివిధ రకాలుగా వస్తాయి. అసలైన కారణం తెలుసుకుంటే ఈ సమస్యను తగ్గించుకోవడం సాధ్యమవుతుంది.
టెన్షన్ తలనొప్పి ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన వల్ల వస్తుంది. ఇలాంటి తలనొప్పులు ఎక్కువగా తల చుట్టూ బిగుతుగా నొప్పి ఉన్నట్లు అనిపిస్తుంది.
మైగ్రేన్ తలనొప్పి సాధారణంగా తల ఒక వైపున తీవ్రంగా ఉంటుంది. ఇది ఉన్నవారికి వెలుతురు, శబ్దం తట్టుకోలేకపోవడం, వాంతులు రావడం కామన్.
క్లస్టర్ తలనొప్పి చాలా తీవ్రమైనది. ముఖ్యంగా ఒక కంటి చుట్టూ భరించలేని నొప్పిగా వస్తుంది. సైనస్ తలనొప్పి ముక్కు బ్లాక్, జలుబు ఉన్నప్పుడు వస్తుంది. ముఖం, కన్ను చుట్టూ భారంగా నొప్పి ఉంటుంది.
ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల రీబౌండ్ తలనొప్పి రావచ్చు. మందు ప్రభావం తగ్గగానే మళ్లీ నొప్పి మొదలవుతుంది.
ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల రీబౌండ్ తలనొప్పి రావచ్చు. మందు ప్రభావం తగ్గగానే మళ్లీ నొప్పి మొదలవుతుంది.
తలనొప్పి తరచూ వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. సరైన చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.