పూజా హెగ్డే గురించి తెలియ‌ని వారుండ‌రు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది పూజా.

అగ్ర హీరోల‌తో క‌లిసి నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజాకు రాధే శ్యామ్ త‌ర్వాత తెలుగులో అవ‌కాశాలు త‌గ్గాయి.

మ‌హేష్ తో చేయాల్సిన గుంటూరు కారం నుంచి ఏ ముహూర్తాన త‌ప్పుకుందో కానీ పూజాకి ఛాన్సులు రావ‌డం ఆగిపోయాయి.

బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేసినా స్టార్ స్టేట‌స్ ద‌క్క‌లేదు. ఈ లోగా తెలుగులో కొత్త భామ‌లు ఎంట్రీ ఇచ్చి స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

కోలీవుడ్ లో పూజాకు అవ‌కాశాలొస్తున్న‌ప్ప‌టికీ తెలుగులో మాత్రం ఛాన్సులు రాక‌పోవ‌డంతో బుట్ట‌బొమ్మ‌ను తెలుగు ఆడియ‌న్స్ మిస్ అవుతున్నారు.

ప్ర‌స్తుతం పూజా చేతిలో దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా కొత్త డైరెక్ట‌ర్ తో ఓ సినిమా త‌ప్ప మ‌రోటి లేదు. ఈ సినిమా రిలీజ‌య్యేలోపు అయినా పూజాకు మ‌రిన్ని ఆఫ‌ర్లు రావాల‌ని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.