ఆఫ‌ర్లు లేక సోష‌ల్ మీడియాకే ప‌రిమిత‌మైన తెలుగ‌మ్మాయి

షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను మొద‌లుపెట్టిన తెలుగ‌మ్మాయి ప్రియాంక జ‌వాల్క‌ర్ అంద‌రికీ సుప‌రిచితురాలే.

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వ‌చ్చిన ట్యాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మై మొద‌టి సినిమాతోనే హిట్టును అందుకుంది.

ఆ సినిమాతో మంచి పాపులారిటీని ద‌క్కించుకున్న ప్రియాంక త‌న అందంతో పాటూ అమాయ‌కత్వంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

ఆ త‌ర్వాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా వ‌చ్చిన ఎస్ ఆర్ క‌ళ్యాణ మండ‌పం మూవీతో మ‌రో హిట్ ను అకౌంట్ లో వేసుకుంది.

త‌ర్వాత ఒక‌ట్రెండు సినిమాల్లో న‌టించినా అవేవీ ప్రియాంక‌కు విజ‌యాన్ని అందించ‌లేదు. ప్ర‌స్తుతం అమ్మ‌డికి ఆఫ‌ర్లు లేక‌పోవ‌డంతో స‌పోర్టింగ్ రోల్స్ చేయ‌డానికి రెడీ అయింది.

టిల్లూ స్వ్కేర్, మ్యాడ్2 లో క‌నిపించి అల‌రించిన ప్రియాంక ప్ర‌స్తుతం ఆఫ‌ర్లు లేక సోష‌ల్ మీడియాకే ప‌రిమిత‌మై, దాని ద్వారా ఆడియ‌న్స్ కు ట‌చ్ లో ఉంటుంది.