ఇచ్చట వాహనములు నడుపరాదు సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయమైన హర్యానా భామ మీనాక్షి చౌదరి.
యాక్టింగ్ పై ఇష్టంతో నటనలోకి వచ్చిన మీనాక్షికి తక్కువ టైమ్ లోనే అవకాశాలు కూడా వచ్చాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన తర్వాత మీనాక్షికి ఛాన్సులు ఎక్కువయ్యాయి.
దుల్కర్ సల్మాన్ తో కలిసి లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ అందుకున్న మీనాక్షి, గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది.
తాజాగా నవీన్ పోలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు అనే సినిమాతో మీనాక్షి ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్న మీనాక్షి యాక్టింగ్ ను అందరూ మెచ్చుకుంటున్నారు.