సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉన్న క్రేజ్ ను తగ్గించగలదు, అదే క్రేజ్ ను అమాంతం పెంచగలదు.
అలా ఎంతో మంది ఓవర్ నైట్ స్టార్లుగా మారి తర్వాత అవకాశాల్లేక ఇండస్ట్రీకి దూరమైన వాళ్లు కూడా ఉన్నారు.
తక్కువ టైమ్ లోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న నేహా శెట్టి కూడా ఈ కోవకే చెందుతుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది.
డీజే టిల్లు సినిమాలో రాధికగా నేహాశెట్టికి వచ్చిన ఫేమ్ అంతా ఇంతా కాదు. కానీ తర్వాత నేహాకు పెద్దగా అవకాశాలు రాలేదు.
కొన్ని సినిమాల్లో కనిపించినా అవి ఊహించిన రీతిలో సక్సెస్ అవలేకపోయాయి.
ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నేహా సోషల్ మీడియాలో రెగ్యులర్ అప్డేట్స్ తో తన ఫాలోవర్లకు టచ్ లో ఉంటూ తన ఫోటోలతో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది.