డిన్నర్ అంటే తేలికగా తినాలి అనే ఆలోచన చాలా మందిలో ఉంది. అందుకే రాత్రిపూట చపాతీలు, కూర, కొద్దిగా పప్పు లేదా సూప్, సలాడ్‌లతో సరిపెట్టేస్తారు.
ఆహారం ఎప్పుడు తినాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏమి తినాలో తెలుసుకోవడం కూడా అంతే అవసరం. రాత్రి భోజనంలో పోషకాలు తప్పనిసరి.
సూప్, సలాడ్ లేదా పండ్లు ఆరోగ్యకరంగా కనిపిస్తాయి. కానీ వీటిలో సరైన ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉండవు. దీంతో శరీరం తృప్తిగా అనిపించదు. ఆకలి త్వరగా వేస్తుంది.
ఇలా తినడం వల్ల ఉదయం లేవగానే అలసట, షుగర్ క్రేవింగ్స్ లాంటి సమస్యలు వస్తాయి. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. జీవక్రియ మందగిస్తుంది.
దీంతో ఉన్న బరువు తగ్గడం కాదు కదా అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా మారతాయి. హార్మోన్లపై ప్రభావం పడుతుంది.
అందుకే రాత్రి భోజనం తక్కువగా తిన్నా, పోషకాలు ఉండేలా చూసుకోవాలి. సరైన ఆహార ఎంపికే ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు కీలకం.