తెలుగు ప్రేక్ష‌కులకు అన‌సూయ భ‌ర‌ద్వాజ్ గురించి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రెగ్యుల‌ర్ గా సోష‌ల్ మీడియాలో త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది.

న్యూస్ ప్రెజెంట‌ర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అన‌సూయ, ఆ త‌ర్వాత బుల్లితెర యాంక‌ర్ గా మారి అంద‌రినీ త‌న యాంక‌రింగ్ తో మెస్మరైజ్ చేసింది.

త‌ర్వాత యాంక‌ర్ కెరీర్ కు గుడ్ బై చెప్పి వెండితెర‌కే ప‌రిమిత‌మైన అన‌సూయ రెండు ద‌శాబ్ధాల కింద‌టే నాగ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

సినిమాల్లో స్పెష‌ల్ రోల్స్ లో న‌టిస్తూ త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్స్ కు వెళ్లి అక్క‌డి నుంచి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

రీసెంట్ గా పుష్ప‌2 సినిమాతో ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకున్న అన‌సూయ త‌న త‌ర్వాతి సినిమా 16 రోజుల పండ‌గ పూజా కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా శారీలో మెరిసి ఆ ఫోటోల‌ను షేర్ చేయ‌గా ఆ ఫోటోలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి.