ముఖంపై మచ్చలు (Dark spots) , ట్యాన్ (Tan) , మొటిమల (Pimples) గుర్తులు ఉంటే చూసేందుకు ఇబ్బందిగా ఉంటుంది. ఇవి కొన్నిసార్లు మన విశ్వాసాన్నీ తగ్గిస్తాయి. ఖరీదైన క్రీములు, ట్రీట్మెంట్లు వాడినా ఫలితం రాకపోతే ఇంటి చిట్కాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అలోవెరా జెల్ (Aloe Vera Gel) స్కిన్‌కి సహజంగా పనిచేస్తుంది.
బెనిఫిట్స్: అలోవెరా మొక్కలో విటమిన్ C, E, యాంటీ ఆక్సిడెంట్స్ (Anti Oxidants) వంటి ఎన్నో చర్మానికి మేలు చేసే పదార్థాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరచి సహజ కాంతిని అందిస్తాయి. అదనంగా, ఈ మొక్క ఇంటి గాలి నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.
మొటిమలు, మచ్చలకు బై: అలోవెరా యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti Inflammatory) గుణాలు మొటిమల ఎర్రదనాన్ని తగ్గిస్తాయి. ఈ జెల్‌ను క్రమం తప్పకుండా రోజు రాస్తే మచ్చలు క్రమంగా లైట్ అవుతాయి. ఇందులోని పోషకాలు స్కిన్‌ను సాఫ్ట్‌గా, ఫ్రెష్‌గా ఉంచుతాయి.
నాచురల్ మాయిశ్చరైజర్: డ్రై స్కిన్ (Dry Skin) వల్ల వచ్చే ముడతలు, పొడితనం అలోవెరా వాడితే చాలా తగ్గుతాయి. ఇది చర్మానికి లోతుగా హైడ్రేషన్ అందించి యాంటీ ఏజింగ్‌లా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల నెక్స్ట్ డే కి స్కిన్ స్మూత్ గా, గ్లోయింగ్ గా మారుతుంది.
ట్యాన్ రిమూవల్: చర్మంపై సన్‌ట్యాన్ పేరుకుపోతే అలోవెరా జెల్ మంచి పరిష్కారం. చేతులు, మెడ, ముఖం—ఏ చోటైనా అప్లై చేస్తే ట్యాన్ క్రమంగా తగ్గిపోతుంది. ఇది మేకప్ ప్రైమర్‌లా కూడా ఉపయోగపడుతుంది.
హెయిర్ కేర్: అలోవెరా జెల్‌ను హెయిర్ మాస్క్‌గా వాడితే హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు మెరిసిపోతుంది. స్కాల్ప్‌లోని పొడితనాన్ని తగ్గించి జుట్టుకు సహజ తేమను అందిస్తుంది.