చలికాలం మొదలైతే సాధారణంగా అందరికీ చలి ఎక్కువగానే ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం ఇతరుల కంటే ఎక్కువగా చలిగా అనిపిస్తుంది. చేతులు, కాళ్లు ఎప్పుడూ చల్లగా ఉండటం, చిన్న గాలికే వణుకు రావడం వంటి సమస్యలు కనిపిస్తాయి.

కారణం: ఇది కేవలం వాతావరణం ప్రభావం మాత్రమే కాదు, శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం కూడా కారణమవుతుందని డాక్టర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఐరన్ (Iron ) విటమిన్ B12 (Vitamin B12) తగ్గితే శరీర వేడి తగ్గి చలి ఎక్కువగా అనిపిస్తుంది.

ఐరన్ డెఫిషియన్సీ: ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ (Hemoglobin) సరైన స్థాయిలో తయారు కాకపోవడం, తద్వారా రక్తం అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను సరిగ్గా తీసుకెళ్లలేకపోవడం జరుగుతుంది. దీనివల్ల శరీరం వేడి ఉత్పత్తి తగ్గిపోతుంది.

విటమిన్ B12: విటమిన్ B12 తగ్గితే ఎర్ర రక్త కణాలు బలహీనపడి రక్తహీనతకు (Bloodlessness) దారి తీస్తాయి. అదే సమయంలో అలసట, బలహీనత, చర్మం పాలి పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

డైట్: ఐరన్ కోసం గుడ్లు (Eggs) , చికెన్ (Chicken) , చేపలు (fish), పాలకూర, కాయధాన్యాలు, బీట్‌రూట్, ఎండుద్రాక్ష, ఖర్జూరం వంటి వాటిని ఆహారంలో చేర్చాలి. విటమిన్ B12 కోసం గుడ్లు, పాలు, పెరుగు, చికెన్ మంచి వనరులు. పూర్తిగా శాఖాహారులు అయితే వైద్యుడు సూచనతో బి12 సప్లిమెంట్లు తీసుకోవచ్చు.

చలి అసాధారణంగా పెరగడం, అలసట తగ్గకపోవడం వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించడం ఆరోగ్యానికి మంచిది.