చాలా మందికి కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యపరంగా ప్రమాదకరం కాకపోయినా, రూపంపై ప్రభావం చూపి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. నిద్రలేమి, ఒత్తిడి, మొబైల్‌ల వాడకం, డీహైడ్రేషన్ వంటి కారణాలతో ఇవి వస్తాయని . ఖరీదైన క్రీములు వాడినప్పటికీ కొన్నిసార్లు ప్రయోజనాలు కనిపించదు. కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొన్ని సింపుల్ కొరియన్ మసాజ్ టెక్నిక్స్ తో ఈ బ్లాక్ సర్కిల్స్ ని ఇంటి వద్ద తగ్గించుకోవచ్చు.

డార్క్ సర్కిల్స్: జన్యుపరమైన కారణాలు, సరైన నిద్ర లేకపోవడం, రక్త ప్రవాహం తగ్గిపోవడం, స్క్రీన్‌లకు ఎక్కువ సమయం గడపడం ఇవన్నీ కంటి చుట్టూ నల్లదనానికి కారణం అవుతాయి. చల్లని వాతావరణం, ఒత్తిడి కూడా ఈ సమస్యను పెంచుతాయి.

కొరియన్ మసాజ్: కంటి ప్రాంతంలో రక్త ప్రసరణ పెరుగితే నల్లటి వలయాలు ఈజీగా తగ్గుతాయి. అందుకోసం రోజుకు 3–4 నిమిషాలు ప్రత్యేకమైన మసాజ్ చేస్తే ఫలితం చూపుతుంది. దీనివల్ల ఫేస్ లో మంచి గ్లో కూడా వస్తుంది. మరి ఆ మసాజ్ ను క్రమబద్ధంగా ఎలా చేయాలో తెలుసుకుందాం.

స్టెప్ 1: కనుబొమ్మల కింద ఉన్న చిన్న ప్రెషర్ పాయింట్‌ను 10 సెకన్ల పాటు సున్నితంగా నొక్కాలి. ఇది కళ్లకు రిలాక్స్ ఇస్తుంది, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

స్టెప్ 2: కంటి  మూల నుంచి బయటివరకు  వేళ్లతో సున్నితంగా నొక్కాలి. ఇది ద్రవ నిల్వను తగ్గించి, కంటి కింద ఉన్న వాపును తగ్గిస్తుంది. మన కళ్ళు చాలా సెన్సిటివ్ కాబట్టి మసాజ్ చేసేటప్పుడు ప్రెషర్ను నియంత్రణలో ఉంచాలి.

స్టెప్ 3: చేతిని పిడికిలిగా బిగించి మెటికలతో నుదుటిపై 10 సెకన్ల పాటు సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేయాలి. ఇది శోషరస ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇలా చేసేటప్పుడు మొదటి పై కాస్త ఆయిల్ ను అప్లై చేసుకుంటే మంచిది.

డైలీ రొటీన్: ఈ మూడు స్టెప్స్‌ను రాత్రిళ్లూ స్కిన్‌కేర్ తర్వాత చేస్తే కంటి ప్రాంతం ప్రకాశవంతంగా, బిగుతుగా కనిపిస్తుంది. అలసట తగ్గి డార్క్ సర్కిల్స్  మాయమవుతాయి.