చలికాలంలో చర్మం డ్రైగా మారడం సాధారణం. ఈ సమయంలో స్కిన్‌కి మాయిశ్చరైజర్ (Moisturizer) అవసరం మరింత పెరుగుతుంది. అయితే దీని కోసం కెమికల్స్ తో నిండిన ప్రొడక్ట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే ఖరీదైన ఉత్పత్తుల బదులు పచ్చి పసుపు (Raw Turmeric) సహజ పద్ధతిలో చర్మాన్ని కాంతివంతంగా మార్చవచ్చు.ఇది నాచురల్ ,సేఫ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా..
సహజమైన మాయిశ్చరైజర్: పచ్చి పసుపులో సహజ నూనెలు, విటమిన్లు (Vitamins) ఉండటం వల్ల చర్మాన్ని సాఫ్ట్‌గా ఉంచుతుంది. చలికాలంలో వచ్చే డ్రైనెస్ (Dryness) , ఎర్రబారడం, మచ్చలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. చర్మానికి సురక్షితమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
పెరుగు,తేనె,పసుపు ప్యాక్: పచ్చి పసుపును మెత్తగా చేసి, అందులో రెండు టీస్పూన్లు పెరుగు (Curd) , కొన్ని చుక్కల తేనె (Honey) కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖం, మెడపై రాసి 10–15 నిమిషాలు ఉంచాలి. వారానికి రెండు సార్లు చేస్తే చర్మం తేమ శాతం పెరిగి సహజ కాంతి వస్తుంది.
నెయ్యి పసుపు ప్యాక్: చర్మం చాలా డ్రైగా ఉన్నవారికి పచ్చి పసుపు–నెయ్యి (Ghee) మిశ్రమం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది చర్మాన్ని లోతుగా పోషించి మెరుస్తూ కనిపించేలా చేస్తుంది.
టాన్ రిమూవల్: కేవలం ఎండాకాలంలోనే కాదు ఎప్పుడూ ఉన్న పొల్యూషన్ వల్ల చలికాలంలో కూడా స్కిన్ టాన్ అవుతుంది. చలికాలంలో వచ్చే ఈ టాన్ తగ్గించడానికి గంధం (Sandalwood) పౌడర్‌లో పసుపు, రోజ్‌వాటర్ (Rose Water) కలిపి ప్యాక్‌గా రాస్తే స్కిన్ ఫ్రెష్‌గా, కాంతివంతంగా మారుతుంది.
పచ్చి పసుపు పాలు: సహజమైన అందం కోసం కేవలం స్కిన్‌కి చేసే ట్రీట్మెంట్ సరిపోదు..మన బాడీ కూడా హెల్తీ గా ఉండాలి. పచ్చి పసుపును పాల్లో వేసి తాగడం ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది చర్మాన్ని లోపలినుంచి హెల్దీగా, గ్లోయింగ్‌గా ఉంచుతుంది. కొద్దిగా నల్ల మిరియాల పొడి కలిపితే మరింత మంచిది.
0218
గమనిక: పసుపు రాసే ముందు ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి. కొంతమందికి స్కిన్ సెన్సిటివిటీ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటివారికి డైరెక్ట్‌గా పచ్చి పసుపు సెట్ అవకపోవచ్చు.