పెళ్లి కొత్తలో భార్యాభర్తలు (Husband–Wife) ఒకరితో ఒకరు ఎక్కువ సమయం మాట్లాడుకుంటారు. కానీ, రానురాను బిజీ షెడ్యూల్, పనుల ఒత్తిడి వల్ల ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. దీంతో మాట్లాడే సమయం తగ్గి, తెలియకుండానే దూరం పెరుగు తుంది. ఈ దూరం కారణంగా ఎన్నో మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. మీ రిలేషన్ 10 లంగా ఉండాలి అంటే రోజుకు ఒక ఐదు నిమిషాలు కేటాయించక తప్పదు.

రోజూ 5 నిమిషాలు: రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ (Relationship Experts) చెప్తున్నట్టు, రోజుకు కేవలం ఐదు నిమిషాలు ప్రేమగా సంభాషించడం ఎంతో ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆ కొద్ది నిమిషాలు ఇద్దరి మనసులోని మాటలు బయటకు రావడానికి సహకరిస్తాాయి. మాట్లాడకపోవడం వల్ల చిన్న సమస్యలు పెద్దవిగా అవుతాయి.. అవి మీ రిలేషన్ తెలియకుండానే దెబ్బతీస్తాయి.

అపార్థాలు దూరం: చాలామంది అనవసరంగా మాట్లాడితే మాటలు పెద్దవై గొడవలు వస్తాయి అనుకుంటారు .కానీ నిజానికి మాట్లాడకపోవడం వల్లే ఎక్కువగా గొడవలు వస్తాయి. అయితే, ప్రతిరోజూ మాట్లాడితే అపార్థాలు తగ్గి, ఇద్దరి మధ్య ఉన్న భావోద్వేగ దూరం తగ్గిపోతుంది. ఎవరి సమస్య ఏంటో వెంటనే అర్థమవుతుంది. లోపాలను ఎర్లీ స్టేజ్ లోనే సరిచేసుకునే అవకాశం దొరుకుతుంది.

స్ట్రాంగ్ బాండింగ్: సంభాషణ వల్ల జీవిత భాగస్వామి ఏం ఇష్టపడతారు, ఏం ఇష్టపడరు అనేది క్లియర్‌గా తెలుస్తుంది. దీంతో అనవసరమైన తగువులు తగ్గి రిలేషన్ నేచురల్‌గా స్ట్రాంగ్ అవుతుంది. ఇది ప్రేమను ఇంకా పెంచుతుంది.

హ్యాపీ రిలేషన్: రోజూ కొద్దిసేపు మాట్లాడుకోవడం ద్వారా కోపం, ఒత్తిడి తగ్గి, ఇద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. మన సమస్యలు వినడానికి మన పక్కనే ఎవరైనా ఉన్నారనేది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాదు మన సమస్యలను పార్ట్నర్ తో ధైర్యంగా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఫ్యూచర్ ప్లానింగ్: కలిసి మాట్లాడినప్పుడు భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది. హ్యాపీ లైఫ్ కోసం ఏ మార్గం మంచిదో కలిసి చర్చించుకోవచ్చు. దీంతో అండర్‌స్టాండింగ్, ప్రేమ రెండూ పెరిగి బంధం మరింత బలపడుతుంది.