ముఖంపై అవాంఛిత వెంట్రుకలు  ఉంటే లుక్ దెబ్బతిన్నట్టే అనిపిస్తుంది. వీటిని తొలగించడానికి వ్యాక్సింగ్, థ్రెడింగ్, లేజర్ ట్రీట్‌మెంట్స్,  కెమికల్ ఫేస్ క్రీమ్స్ ఎన్నో ఉన్నాయి.  కానీ కొంతమంది సహజమైన  ఇంటి చిట్కాలను ఇష్టపడతారు.  అలాంటి వారి కోసం కొన్ని టిప్స్..

నో కెమికల్స్: కెమికల్ ట్రీట్‌మెంట్స్ అవసరం లేకుండానే కిచెన్ పదార్థాలతో సాధారణంగా ఫేషియల్ హెయిర్ తగ్గించుకోవచ్చు. కెమికల్స్ ఎక్కువగా వాడితే స్కిన్ మృదుత్వాన్ని కోల్పోతుంది. అందుకే హోమ్ రెమెడీస్ స్కిన్‌కు హాని లేకుండా సహజంగా పనిచేస్తాయి.

మెంతులు–స్పియర్‌మింట్ టీ: ఒక గిన్నెలో చిన్న గ్లాస్ నీరు ,స్పూన్ మెంతులు, చిటికెడు దాల్చిన చెక్క వేసి మరిగించాలి. ఆ తర్వాత స్పియర్‌మింట్ టీ బ్యాగ్‌ని పెట్టి కొన్ని నిమిషాలు నాననివ్వాలి. ఈ డ్రింక్‌ను ప్రతిరోజూ తాగితే ముఖం మీద వెంట్రుకల పెరుగుదల క్రమంగా తగ్గుతుంది.

స్పియర్‌మింట్ ఆయిల్‌: స్పియర్‌మింట్, ఆండ్రోజెన్ విడుదలను తగ్గించి హెయిర్ గ్రోత్‌ను నియంత్రిస్తుంది.మీ డైలీ మాయిశ్చరైజర్‌లో రెండు చుక్కల స్పియర్‌మింట్ ఆయిల్ వేసి కలిపి రాత్రిళ్లు అప్లై చేస్తే స్కిన్ సాఫ్ట్‌గా మారడమే కాకుండా అన్‌వాంటెడ్ హెయిర్ తగ్గడానికి సహాయపడుతుంది. అయితే ఈ ఆయిల్ ను ఎక్కువ పరిమాణంలో వాడకూడదు.

పసుపు: ఆయుర్వేదంలో పసుపుకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో ఈ అడ్వాంటేడ్ హెయిర్ ని రిమూవ్ చేయడం ఒకటి అని చాలామందికి తెలియదు. కస్తూరి పసుపు వేసి ఆడించిన సున్నిపిండి తో రోజు స్నానం చేయడం వల్ల కూడా అన్వాంటెడ్ హెయిర్ అదుపులో ఉంటుంది.

ఓట్స్ బనానా మాస్క్: ఓట్స్‌ని అరటిపండు గుజ్జుతో కలిపి పేస్ట్‌గా రాస్తే ముఖంపై ఉన్న అన్‌వాంటెడ్ హెయిర్ క్రమంగా తగ్గుతుంది. ఈ మిశ్రమం స్కిన్‌కు స్క్రబ్‌లా పనిచేసి రూట్స్ ను వీక్ చేసి తొలగించడంలో సహాయపడుతుంది. వారంలో రెండు సార్లు అప్లై చేస్తే స్కిన్ స్మూత్‌గా మారి హెయిర్ గ్రోత్ నెమ్మదిస్తుంది.